News December 17, 2024

పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి

image

AP: అమరావతిని పైప్డ్ గ్యాస్ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైప్డ్ గ్యాస్ అందించేందుకు IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) ప్రభుత్వాన్ని సంప్రదించింది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ అందిస్తామని తెలిపింది. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొంది. కాగా నివాసాలు, హోటళ్లు, సంస్థలు అన్నింటికీ సిలిండర్లతో కాకుండా పైపులతోనే గ్యాస్ అందిస్తారు.

Similar News

News September 20, 2025

ఇక గ్రీన్ కార్డు కష్టమే గురూ..!

image

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ట్రంప్ షాక్ ఇచ్చారు. గ్రీన్ కార్డు రావాలంటే EB-3 క్యాటగిరీలోని స్కిల్డ్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ 12 నుంచి 40 ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా H1B వీసాల అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.88 లక్షలు చెల్లిస్తూ ఉంటేనే వీసా రెన్యూవల్ అయి గ్రీన్ కార్డు వస్తుంది.

News September 20, 2025

వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

image

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ మద్దతు ధర(దూది పింజ పత్తికి క్వింటాకు ₹8,110, తక్కువ దూది పింజ ఉంటే ₹7,710) లభించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించాలన్నారు.

News September 20, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,12,150కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.750 ఎగబాకి రూ.1,02,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.