News December 17, 2024
రేపు ఆస్ట్రేలియా వ్యూహం ఎలా ఉంటుందో!
ఆఖరి వికెట్ భాగస్వామ్యం పుణ్యమా అని బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఫాలో ఆన్ తప్పించుకుంది. అయితే ఇంకా 193 పరుగులు వెనుకబడింది. ఈ నేపథ్యంలో రేపు ఆస్ట్రేలియా వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉదయం ఆట మొదలైన 10 ఓవర్లలోపే భారత ఇన్నింగ్స్ ముగిసే అవకాశం ఉంది. ఆసీస్ ఓ 25 ఓవర్లు ఆడి భారత్‌కు 300 ప్లస్ టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగియచ్చు.
Similar News
News February 5, 2025
విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం
AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
News February 5, 2025
కొత్త జెర్సీలో భారత ప్లేయర్లు
ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. కొత్త జెర్సీతో టీమ్ సభ్యులు దిగిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ & క్లాసీ లుక్‌తో ఉన్న జెర్సీలో మన ప్లేయర్లు అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపు విదర్భ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 5, 2025
BREAKING: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఆయన జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో రేపటి క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపాయి.