News December 18, 2024
రోహిత్ ధీమాగా లేడు: దినేశ్ కార్తీక్

భారత కెప్టెన్ రోహిత్ శర్మలో ధీమా లేదని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఆ ప్రభావం ఆయన ఆటమీద కూడా కనిపిస్తోందని పేర్కొన్నారు. ‘రోహిత్ తన టెక్నిక్‌ను తాను విశ్వసించాలి. ఆ టెక్నిక్‌తోనే కదా దశాబ్దానికి పైగా క్రికెట్ ఆడారు. తన సమస్య అది కాదు. ఆయనలో విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోంది. వాటిపై పోరాడాలి. తనపై తనకు నమ్మకమున్న రోహిత్ శర్మ ఇప్పుడు దేశానికి అవసరం’ అని పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
News July 6, 2025
మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఎక్కడెక్కడ పెడతారంటే?

ఇటీవల బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి నగేశ్ ఆఫీస్‌లోని బాత్రూమ్‌లో మహిళల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డాడు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా అద్దం వెనుక, తలుపు వద్ద, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూ పేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించవచ్చని చెబుతున్నారు.