News December 18, 2024

4427 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి: టీడీపీ

image

AP: భూ సమస్యల పరిష్కారానికై ఈనెల 6 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తోన్న రెవెన్యూ సదస్సులకు అద్భుత స్పందన వస్తోందని టీడీపీ తెలిపింది. 10 రోజుల్లో రెండున్నర లక్షల మంది హాజరయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో 17403 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు 4427 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ పూర్తయిందని ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 8 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని పేర్కొంది.

Similar News

News November 16, 2025

AP న్యూస్ రౌండప్

image

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ

News November 16, 2025

ఇతిహాసాలు క్విజ్ – 68 సమాధానాలు

image

ప్రశ్న: కురుక్షేత్రాన్ని 3 బాణాలతో ముగించగల యోధుడు ఎవరు?
జవాబు: భీముడి మనవడు. ఘటోత్కచుడి కుమారుడు అయిన బార్బరీకుడికి శివుడి ద్వారా 3 బాణాలతో యుద్ధాన్ని ముగించగల శక్తి లభించింది. ఆయన ఓడిపోయే పక్షం వైపు పోరాడతానని ప్రమాణం చేయడంతో యుద్ధం క్షణాల్లోనే ముగిసి, ఎవరూ మిగలరని గ్రహించి, ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు, బార్బరీకుడి శిరస్సును దానంగా తీసుకొని, పోరులో పాల్గొనకుండా చేశాడు.<<-se>>#Ithihasaluquiz<<>>

News November 16, 2025

ఎల్లుండి ఉ.10 గంటలకు..

image

AP: ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈనెల 18న 10AMకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న 10AM వరకు నమోదుచేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బు చెల్లించాలి. 21న కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ తదితర టికెట్లు, 24న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, 25న రూ.300 టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.