News December 18, 2024

కోలుకుంటున్న డోన్ ఎమ్మెల్యే

image

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా నిన్న ఆయన స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ విషయం తెలియగానే కోట్ల అనుచరులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేశారు.

Similar News

News February 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

News February 5, 2025

అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి వినతి

image

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం కలిసి రైల్వే గేట్ నంబర్ 197 వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణంపై విన్నవించారు. పట్టణంలో ఈ గేటు మూసివేయడంతో మార్కెట్ యార్డ్‌కు వెళ్లాల్సిన రైతులు, కార్మికులు, పాదచారులు అదనంగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు.

News February 4, 2025

జాతీయ నులిపురుగుల నివారణ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. 1-19 ఏళ్ల లోపు వారందరూ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!