News December 18, 2024

చివరి విడత EAPCET కౌన్సెలింగ్

image

AP: EAPCET(Bi.P.C) స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదుకు రేపటి నుంచి 22 వరకు అవకాశం కల్పించింది. 22న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. 24న సీట్లు కేటాయిస్తారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా బయో, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో చేరవచ్చు.

Similar News

News January 12, 2026

NLG: సర్కార్ మాటలకే పరిమితం.. కొత్త పథకం ఎక్కడా?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా ప్రభుత్వం మరిచిపోయిందని వృద్ధులు మండిపడుతున్నారు. జిల్లాలో వేలాదిమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

News January 12, 2026

స్ఫూర్తిని నింపే స్వామి వివేకానంద మాటలు

image

⋆ లేవండి, మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి
⋆ నీ వెనుక, నీ ముందు ఏముందనేది నీకనవసరం. నీలో ఏముందనేది ముఖ్యం
⋆ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు
⋆ భయపడకు, ముందుకు సాగు.. బలమే జీవితం, బలహీనతే మరణం
⋆ కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
☛ నేడు వివేకానంద జయంతి

News January 12, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,690 పెరిగి రూ.1,42,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,550 ఎగబాకి రూ.1,30,300 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.12వేలు పెరిగి రూ.2,87,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి