News December 18, 2024

నెల్లూరులో మహిళలతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు 

image

నెల్లూరులోని వాకర్స్ రోడ్డుకు చెందిన మహిళలు లక్కీ వైన్ షాప్‌కు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం లక్కీ వైన్ షాప్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేస్తున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు. డబ్బు చూపిస్తూ సైగలు చేస్తూ వీడియోలు, ఫొటోలు తీశారని మహిళలు చిన్న బజారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 2, 2026

నెల్లూరులో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’

image

నెల్లూరు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పిల్లలపై లైంగిక నేరాల నిరోధం, బాల్య వివాహాల నిర్మూలన, పోక్సో చట్టంపై శక్తి బృందాలు పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతూ.. పిల్లల రక్షణ కోసం డయల్ 100, 1098 సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 2, 2026

నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.

News March 2, 2026

నెల్లూరు కిమ్స్‌కు 9మంది చిన్నారుల తరలింపు

image

నెల్లూరు జిల్లా ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పందించారు. 9మంది చిన్నారులను కిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ప్రకటించారు. ఆ ఏరియాలో ఎలాంటి కాంటామినేషన్ లేకుండా చర్యలు తీసుకువాలని ఆదేశించారు. తిరుపతి నుంచి ఫోరెన్సిక్ టీంను పిలిపించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.