News December 18, 2024
ఆగిన వర్షం.. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం!

బ్రిస్బేన్ టెస్టులో 5వ రోజు వర్షం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడగా అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఉదయం ఆట ప్రారంభమైన కాసేపటికే ఇండియా ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండగా వర్షం మొదలైంది. ప్రస్తుతం వాన ఆగిపోగా, తిరిగి జల్లులు పడకపోతే 8.10 తర్వాత మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియా 260 రన్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 185 రన్స్ ఆధిక్యంలో ఉంది.
Similar News
News September 18, 2025
సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం
News September 18, 2025
UAEపై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్: పాక్ జట్టు UAEపై 41 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 146/9 పరుగులు చేసింది. ఫకర్ జమాన్(50), షాహీన్ అఫ్రీది(29*), సల్మాన్ అఘా(20) రాణించారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రన్ జిత్ 3, ధ్రువ్ 1 వికెట్ తీశారు. UAE 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాహుల్ చోప్రా(35), ధ్రువ్(20) పర్వాలేదనిపించారు. PAK బౌలర్లలో షాహీన్ అఫ్రీది, అబ్రార్, రౌఫ్‌లు తలో 2 వికెట్లతో రాణించారు.
News September 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.