News December 18, 2024

ఆస్ట్రేలియా 5 వికెట్లు డౌన్

image

బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయింది. త్వరగా రన్స్ చేసి భారత్‌ ముందు భారీ టార్గెట్ ఉంచాలనే తొందర్లో ఆసీస్ ప్లేయర్లు వికెట్లు కోల్పోతున్నారు. మెక్‌స్వీని, ఖవాజా, లబుషేన్, మిచెల్ మార్ష్, స్మిత్ ఔట్ అయ్యారు. బుమ్రా, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. క్రీజులో హెడ్, క్యారీ ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 33/5గా ఉంది.

Similar News

News January 24, 2026

పేర్ని నాని – అనగాని మధ్య డైలాగ్ వార్

image

AP: మంత్రి అనగాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సంస్కారహీనుడు, మతిస్తిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ. ఆయన అడిగిన రూ.25 కోట్లు జగన్‌ ఇచ్చుంటే ఇవాళ నా పక్కన ఉండేవారు’ అని పేర్ని నాని విమర్శించారు. అటు ‘తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డ్యాష్‌లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేది ఏంటి? వాడి బతుకేంటో నాకు తెలుసు’ అని అనగాని తీవ్రంగా స్పందించారు.

News January 24, 2026

పులిపిర్లకు ఇలా చెక్

image

వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. అవి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లు ఉన్న చోట అద్దితే పూర్తిగా తగ్గిపోతాయి. • ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.

News January 24, 2026

ఉద్యోగులకు షాక్.. డుమ్మా కొడితే ఇంటికే!

image

TG: డ్యూటీకి రెగ్యులర్‌గా రాని ప్రభుత్వ ఉద్యోగులపై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఏడాదికి మించి విధులకు దూరంగా ఉంటే నేరుగా సర్వీసు నుంచి తొలగించేలా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్’ను మారుస్తూ CS ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా ఐదేళ్లు సెలవులో ఉన్నా, అనుమతి లేని ఫారిన్ సర్వీసులో కొనసాగినా వేటు తప్పదు. ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీస్ ఇస్తారు.