News December 18, 2024
వరదరాజపురం వద్ద షాపులోకి దూసుకెళ్లిన వ్యాను

గణపవరం మండలం వరదరాజపురం వద్ద బుధవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. తాడేపల్లిగూడెం నుంచి గణపవరం వస్తున్న వ్యాను వరదరాజపురం వద్ద చికెన్ షాపులోకి దూసుకెళ్లింది. ఘటనలో రెండు టూ వీలర్లు నుజ్జు నుజ్జు అయినట్లు తెలుస్తోంది. కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2026
తణుకు: కేబుల్ వైరు మెడకు తగిలి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 26, 2026
ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించేది లేదన్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ విభాగాలకు నిర్దేశిత గడువులోగా బియ్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.