News December 18, 2024
డింగా.. డింగా: ప్రజల్ని వణికిస్తున్న కొత్త రోగం!

ఉగాండాలో కొత్త రోగం పుట్టుకొచ్చింది. పేరు డింగా డింగా. అంటే డాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్థం. కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300+ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయపడుతున్నారు. రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది. జ్వరం, వీక్‌నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు.
Similar News
News November 12, 2025
ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

భారత్‌లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్‌వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News November 12, 2025
కొత్త వాహనాలు కొంటున్నారా?

APలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి వారంలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నంబర్ రాకపోతే ఆటోమేటిక్‌గా కేటాయింపు జరిగేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం శాశ్వత నంబర్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.500-1000 ఇస్తేనే నంబర్ ఇస్తామని వాహన డీలర్లు బేరాలాడుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ఇకపై వీటికి చెక్ పడనుంది.
News November 12, 2025
భారీ జీతంతో రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<


