News December 18, 2024

కృష్ణా: శబరిమలై ప్రయాణికుల కోసం 4 ప్రత్యేక రైళ్లు

image

శబరిమలై వెళ్లేవారికై నరసాపురం(NS)- కొల్లామ్‌(QLN) మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ PRO ఏ.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు 2025 JAN 15, 22న NS- QLN(నం.07183), JAN 17, 24న QLN- NS(నం.07184) రైళ్లు నడుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News May 7, 2025

కృష్ణా: మే 11న ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు 

image

PM సూర్యఘర్ పథకం మంజూరు కోసం జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ఆదర్శ గ్రామాల్లో మే 11వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో CPDCL ఆధ్వర్యంలో PM సూర్య ఘర్ పథకంపై అధికారులు, బ్యాంకర్లకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి పలు సూచనలు చేశారు. 

News May 7, 2025

పాకిస్తాన్ వ్యక్తులు భారత్ వదిలిపెట్టి వెళ్లాలి: ఎస్పీ

image

కృష్ణా జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పకుండా 27వ తేదీలోపు భారత్‌ను విడిపోవాల్సి ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. ఈ నియమాన్ని పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లాలన్నారు. 

News May 7, 2025

గ్రామాభివృద్ధిపై డీపీఆర్ తయారు చేయండి: కలెక్టర్

image

కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను వారం రోజుల లోపు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.