News December 18, 2024

IND vs AUS మ్యాచ్ డ్రా

image

బ్రిస్బేన్‌లో జరుగుతున్న IND vs AUS 3వ టెస్ట్ డ్రా అయింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్‌లో AUS 89-7 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో కలిపి భారత్ ముందు 275పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. IND బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికి 8/0 వర్షం ప్రారంభమైంది. వర్షం తీవ్రత పెరగడం, బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. BGT 5టెస్టుల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.

Similar News

News September 13, 2025

రాత్రిళ్లు వాస్తు ఎందుకు చూడరంటే..

image

పాతకాలం పండితులు రాత్రి సమయంలో వాస్తు చూడరాదని చెప్పారు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఉండే చీకటి వల్ల నిర్మాణంలోని సూక్ష్మమైన లోపాలు కనిపించకపోవచ్చు. కంటితో చూసే అంచనాలు తప్పు కావచ్చు. పరిసరాలలోని శక్తి ప్రవాహాన్ని, దిశలను సరిగ్గా అంచనా వేయడం కష్టం. దీనివల్ల వాస్తు దోషాలు కలిగే అవకాశం ఉంది. అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు రాత్రిపూట వాస్తు చూడటాన్ని నిరాకరించారు.

News September 13, 2025

రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ ఎస్తర్?

image

హీరోయిన్ ఎస్తర్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెల్ల రంగు గౌను ధరించి ఆమె SMలో ఓ పోస్ట్ చేశారు. ‘జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమ, ఆశీర్వాదాలు కురిపిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తా’ అంటూ రాసుకొచ్చారు. కాగా సింగర్ నోయల్, ఎస్తర్ 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుని, 6 నెలల్లోపే విడిపోయారు.

News September 13, 2025

భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.