News December 18, 2024

పశుసంవర్ధకశాఖలో త్వరలో పోస్టుల భర్తీ

image

AP: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. అటు శ్రీకాకుళం, ప.గో. జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News January 26, 2026

10వేల కిలోల పేలుడు పదార్థాలు.. రిపబ్లిక్ డే వేళ కలకలం

image

రిపబ్లిక్ డే ముందు రాత్రి రాజస్థాన్‌లో భారీగా పేలుడు <<18942074>>పదార్థాలు<<>> పట్టుబడటం కలకలం రేపింది. నాగౌర్(D) హార్సౌర్‌‌‌లోని ఫామ్‌హౌజ్‌లో పోలీసులు 10వేల KGs అమ్మోనియం నైట్రేట్ బ్యాగులు, డిటోనేటర్లు గుర్తించారు. సులేమాన్ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాటిని ఎందుకు నిల్వ చేశాడు? క్రిమినల్ హిస్టరీ ఉన్న అతడికి ఇతర రాష్ట్రాల వారితో లింక్‌లు ఉన్నాయా? అనే కోణంలో ఇంటరాగేట్ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

News January 26, 2026

భీష్మాష్టమి పూజా విధానం

image

ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. శాంతికి చిహ్నమైన తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించాలి. విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలతో అర్చించాలి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం ఉండాలి. జాగరణ చేయాలి. తామర వత్తులతో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణంతో ఇంటికి శుభం కలుగుతుంది. పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం అందించడం ఎంతో శ్రేష్ఠం.

News January 26, 2026

మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

image

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.