News December 18, 2024

గూడూరు : మెమూ రైలు వేళల్లో మార్పులు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం వెళ్లే మెమూ రైలు వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం. 06745 గతంలో సూళ్లూరుపేట నుంచి ఉదయం 7.55 కు బయలుదేరేది. ఇప్పుడు 8.10కి బయలుదేరుతుంది. అలానే గూడూరుకు 8.55 కు చేరుకునే ఈబండి తాజాగా 9.27 కు చేరుకుంటుంది. నెల్లూరుకు గతంలో 10.05 కు చేరుకునే రైలు ఇప్పుడు 10.30 కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News February 27, 2026

చెవులు మూసుకుని నెల్లూరు MLC నిరసన

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మండలిలో కింద కూర్చొని ఆందోళన చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవులు మూసుకుని, ఇతర MLCలు కళ్లు, నోరు మూసుకుని తమ నిరసన తెలిపారు.

News February 27, 2026

నెల్లూరు DPO కీలక ఆదేశాలు

image

నెల్లూరు జిల్లాలోని పంచాయతీల్లో 100% ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని DPO వసుమతి ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పాదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.

News February 27, 2026

నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.