News December 18, 2024
మస్క్ సంపద రూ.42.46 లక్షల కోట్లు

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. అమెరికాలో రాజకీయ మార్పులు, టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల షేర్లు పెరగడంతో ఆస్తులకు రెక్కలొచ్చాయి. తాజాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో $500 బిలియన్లకు చేరుకుంది. అంటే అక్షరాలా రూ.42.46 లక్షల కోట్లు. ప్రపంచంలో ఇంత ఆస్తి కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు.
Similar News
News November 15, 2025
కలియుగ ధర్మ సూత్రమిదే..

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.
News November 15, 2025
బిహార్: ఎన్డీఏ విజయానికి కారణాలివే..

☞ మోదీ-నితీశ్ కాంబోకు ప్రజలు మొగ్గు చూపడం
☞ పెరిగిన మహిళా ఓటర్ల శాతం
☞ మహిళా సంక్షేమ పథకాల అమలు
☞ ఎన్నికలకు ముందు 25 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేయడం
☞ ‘జంగల్ రాజ్’(RJD) పాలనపై ప్రజలకు నమ్మకం లేకపోవడం
☞ మహాగఠ్‌బంధన్ కూటమిలో సీట్ల కేటాయింపులో ఘర్షణ
☞ లాలూ యాదవ్ కుటుంబంలో తేజస్వీ, తేజ్ ప్రతాప్ మధ్య చీలికలు
☞ కలిసొచ్చిన డబుల్ ఇంజిన్ సర్కార్, వికసిత్ బిహార్ నినాదం
News November 15, 2025
పాపం తేజస్వీ.. సీఎం అవుదామనుకుంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<18289323>>ఫలితాలు<<>> RJD నేత తేజస్వీ యాదవ్‌కు పీడకలను మిగిల్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 75 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని, తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేజస్వీ భావించారు. అంతేకాకుండా ఈసారి సీఎం కుర్చీ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆర్జేడీకి 25 సీట్లు మాత్రమే కట్టబెట్టి ముఖ్యమంత్రి కావాలన్న తేజస్వీ ఆశలను ఆవిరి చేశారు.


