News December 18, 2024
అదానీ, ప్రధాని మన పరువు తీస్తున్నారు: రేవంత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734509725477_653-normal-WIFI.webp)
TG: అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మనదేశ గౌరవానికి భంగం కలిగించడమే. అదానీపై విచారణ జరగాలి. జేపీసీలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేపట్టాం’ అని తెలిపారు.
Similar News
News February 5, 2025
Ace pro EV: విప్లవాత్మక లాస్ట్-మైల్ డెలివరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738761681591_955-normal-WIFI.webp)
టాటా మోటార్స్ Ace Pro EV ని పరిచయం చేసింది, ఇది సమర్థవంతమైన లాస్ట్-మైల్ డెలివరీ కోసం రూపొందించిన అద్భుతమైన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం. 155+ కి.మీ. పరిధి, 750 కిలోల బెస్ట్-ఇన్-క్లాస్ పేలోడ్ మరియు ADAS తో సహా అధునాతన భద్రతా లక్షణాలు కలవు. స్మార్ట్ కనెక్టివిటీ, మల్టిపుల్ బాడీ కాన్ఫిగరేషన్లతో, జీరో ఎమిషన్స్ ను కొనసాగిస్తూ లాభదాయకత పెంచుతుందని వినియోగదారులకు మాటిస్తోంది.
News February 5, 2025
ఢిల్లీ బీజేపీదే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738762853808_367-normal-WIFI.webp)
ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరి 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాగా కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
News February 5, 2025
ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738762553423_367-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.