News December 18, 2024

1000 కొత్త బస్సులు కొంటాం: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా 1000 కొత్త బస్సులు కొంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 40 నుంచి 100శాతానికి పెరిగిందన్నారు. కొత్త బస్సులను డ్వాక్రా సంఘాల ద్వారా కొంటామన్నారు. అవసరమైన చోట కొత్త డిపోలు నిర్మిస్తామన్నారు. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లకు బస్సులను పెంచుతామని MLAల ప్రశ్నలకు అసెంబ్లీలో బదులిచ్చారు.

Similar News

News November 5, 2025

భార్యకు చిత్రహింసలు.. 86 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

image

ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వృద్ధాప్యంలో ఓ వ్యక్తి భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బంధువులను కలవనీయకుండా శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అవమానించాడు. బాధలను తట్టుకోలేని ఆమె కోర్టుకు వెళ్లింది. దీంతో 86ఏళ్ల ధనశీలన్‌కు 6 నెలల జైలు శిక్ష, ₹5K ఫైన్ విధించింది. దీనిపై మరోకోర్టు స్టే విధించగా, శిక్ష కరెక్టేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాహం అంటే బాధలను భరించడం కాదని చెప్పింది.

News November 5, 2025

నేడు గిరి ప్రదక్షిణ చేస్తే..?

image

అరుణాచలంలోని అన్నామలై కొండను శివలింగంగా భావించి చేసే ప్రదక్షిణనే ‘గిరి ప్రదక్షిణ’ అంటారు. అయితే ఈ ప్రదక్షిణను కార్తీక పౌర్ణమి రోజున చేయడం వల్ల మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. 14KM ఉండే ఈ గిరి చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పున్నమి వెలుగులో ప్రదక్షిణ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు.

News November 5, 2025

త్వరలో పెన్షన్లపై తనిఖీలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు చేసేందుకు సెర్ప్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, మండల పింఛన్ ఇన్‌ఛార్జులకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. పెన్షన్ల పంపిణీ, చెల్లింపులో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేసింది.