News December 18, 2024

కోహ్లీ ఒక్కడే మిగిలాడు!

image

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్‌రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి WC ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.

Similar News

News July 4, 2025

పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్.. ఏం చేయాలి?

image

HYDలో ‘కిలోమీటర్ దూరానికి గంట పట్టింది’ అని వే2న్యూస్‌లో పోస్ట్ అయిన <<16941177>>వార్తకు<<>> యూజర్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఒక్కరి ప్రయాణం కోసం కార్లను వాడటం ట్రాఫిక్‌కు ప్రధాన కారణమని అంటున్నారు. కంపెనీలన్నీ ఒకే చోట ఉన్నాయని, వాటిని వివిధ ప్రాంతాలకు తరలించాలని మరికొందరు సూచించారు. మెట్రో, ఆర్టీసీ లాంటి ప్రజారవాణాకు పెద్దపీట వేయాలంటున్నారు. HYDలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏం చేయాలో కామెంట్ చేయండి.

News July 4, 2025

ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. 2006 తర్వాత ఓ టెస్టులో తొలి 5 ఓవర్లలో 10 ERతో 50 రన్స్ ఇచ్చిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ బజ్ బాల్ ధాటికి ప్రసిద్ధ్ బలైపోయారు. పదే పదే షార్ట్ బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిద్ధ్ సహా మిగతా బౌలర్లూ పెద్దగా ప్రభావం చూపట్లేదు.

News July 4, 2025

ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్‌పై ఫైన్ లేదు

image

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్‌పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.