News December 18, 2024

హోంగార్డులకు హైకోర్టులో ఊరట

image

AP: కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఏపీ హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా రూపొందించాలని తీర్పు చెప్పింది. కాగా, సామాజిక రిజర్వేషన్లు వర్తింపజేసి, ప్రిలిమినరీ పరీక్షలో తమకు క్వాలిఫైయింగ్ మార్కులు రాలేదంటూ తమను రాతపరీక్షలకు అనుమతించలేదని పలువురు కోర్టుకెక్కారు.

Similar News

News September 20, 2025

భారత్‌తో వన్డే.. ఆసీస్ అమ్మాయిల విధ్వంసం

image

భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ చెలరేగింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూనీ 75 బంతుల్లోనే 138 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. ఆమె ఏకంగా 23 ఫోర్లు బాదారు. జార్జియా 81, పెర్రీ 68, గార్డ్‌నర్ 39, హీలీ 30 రన్స్‌తో రాణించారు. ఉమెన్స్ వన్డేల్లో 400 స్కోర్ దాటడం ఇది ఏడోసారి కాగా ఆసీస్ రెండో సారి ఈ ఫీట్ సాధించింది. ఈ భారీ స్కోర్‌ను భారత్ ఛేదిస్తుందా? COMMENT

News September 20, 2025

రాష్ట్రంలో 9 పార్టీల తొలగింపు.. ఏవంటే?

image

TG: దేశవ్యాప్తంగా రెండో దశలో 474 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం <<17762955>>తొలగించిన<<>> విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. లోక్‌సత్తా, ఆల్‌ ఇండియా ఆజాద్ కాంగ్రెస్, ఆల్‌ ఇండియా బీసీ ఓబీసీ, బీసీ భారత దేశం, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి, నవభారత్ నేషనల్, TG ప్రగతి సమితి, TG ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయన్నారు.

News September 20, 2025

మహిళా ఈ-హాత్‌ స్కీమ్ గురించి తెలుసా?

image

కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్‌ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్‌ ఒక ద్విభాషా మార్కెటింగ్‌ ప్లాట్‌ ఫామ్‌. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు.