News December 19, 2024
తాండూరు: పత్రాలు లేని వాహనాలకు జరిమానా

తాండూరు మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధి అండర్ బ్రిడ్జి ఐబీ చౌరస్తా వద్ద సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ..ప్రతి వాహనా దారులు వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Similar News
News November 5, 2025
సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది పటిష్టమైన సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం పోలీస్ హెడ్ కోటర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఉండాలని, డయల్ 100 సేవలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాత్రుళ్లు గస్తీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.
News November 5, 2025
ఉట్నూర్: ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపఃల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9885762227, 9321825562ను సంప్రదించాలాన్నారు
News November 5, 2025
పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు.


