News December 19, 2024
భవానీ దీక్షా విరమణలకు టెక్ తోడు: కలెక్టర్ లక్ష్మీశ

టెక్ తోడుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ శాఖల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర బాబుతో కలిసి యాప్‌ను పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా చేయాల్సిన మార్పులపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News January 27, 2026
పొగమంచు వల్ల అపరాల సాగు రైతుకు నష్టమే..!

కృష్ణాజిల్లాలో పొగమంచు ప్రభావంతో అపరాల సాగు రైతులు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో సూర్యరశ్మి పంటపై పడకపోవడం వల్ల ఆకులపై తేమ పెరిగి ఫంగస్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. దీని కారణంగా అపరాల మొక్కల ఎదుగుదల లోపించి, పూత–గింజ దశలో ఉన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రైతుకు నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు
News January 27, 2026
అపూర్వ సహోదరులు.. పోలీస్ విభాగానికి గర్వకారణం

కృష్ణ జిల్లా పోలీస్ విభాగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. H.జంక్షన్ SI వి.సురేష్, పామర్రు CI. వి.సుభాకర్ స్వయాన అన్నదమ్ములు. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్, కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఇద్దరూ ఒకే వేదికపై ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు హోదాల్లో ఒకే సందర్భంలో పురస్కారాలు అందుకోవడం పోలీస్ విభాగానికి గర్వకారణం.
News January 27, 2026
వచ్చే నెల 7న ఉయ్యూరు వీరమ్మ తల్లి సిడి బండి ఉత్సవం!

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో 11వ రోజును ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఆరోజున సిడి బండి ఉత్సవంగా ఫిబ్రవరి 7న జరగనుంది. కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడిని సిడి బండిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అదే టైంలో ఆ యువకుడిని అరటిపండులతో కొట్టడం సంప్రదాయం. ఆ ఒక్క రోజే లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా. మరి మీరు వెళుతున్నారా కామెంట్ చేయండి.


