News December 19, 2024

రాజాంలో నేడు నీటి సరఫరా బంద్

image

రాజాం పరిధిలోని పాలకొండ రోడ్డులో పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొనుగుట్టువలస, అంబేద్కర్ కాలనీ, విద్యానగర్, వరలక్ష్మి నగర్, మారుతి నగర్ ప్రాంతాలలో నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Similar News

News September 15, 2025

శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

image

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.

News September 15, 2025

సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోల్ మంత్రి, కలెక్టర్

image

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అభివృద్ధి పదం వైపు నడుస్తున్న రాష్ట్రాన్ని, జిల్లాలను అధికారులు సమన్వయంతో పనిచేసే మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

News September 15, 2025

శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

image

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.