News December 19, 2024
కడప జిల్లా రోడ్లను అభివృద్ధి పరచాలి: ఎంపీ అవినాశ్

కడప జిల్లా పరిధిలోని ముద్దనూరు నుంచి రేణిగుంట వరకు అస్తవ్యస్తంగా ఉన్న జాతీయ రోడ్డును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందించారు. గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. కడప- ముద్దునూరు రోడ్డు నాలుగు వరుసల రహదారిగా మార్చాలని కోరారు.
Similar News
News November 9, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
News November 9, 2025
కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్‌కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.


