News December 19, 2024

డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ప్రకటన
1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం (ఫొటోలో)
* గోవా విముక్తి దినోత్సవం

Similar News

News November 6, 2025

చాప్‌మన్ విధ్వంసం.. 28 బంతుల్లో 78 రన్స్

image

విండీస్‌తో రెండో T20లో కివీస్ బ్యాటర్ చాప్‌మన్ విధ్వంసం సృష్టించారు. 28 బంతుల్లోనే 78 పరుగులు చేశారు. ఇందులో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో NZ తరఫున ఒక T20Iలో అత్యధిక స్ట్రైక్‌రేటు(279)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 20 ఓవర్లలో 207-5 స్కోర్ చేయగా, WI 204-8 స్కోరుకు పరిమితమై ఓడిపోయింది. పావెల్ 45(16B), షెఫర్డ్ 34(16B), ఫోర్డే 29(13B) రన్స్ చేసినా ఫలితం లేకపోయింది.

News November 6, 2025

న్యూక్లియర్ సెక్టార్‌లోకి ఏఐ రోబోట్

image

అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి న్యూక్లియర్ సెక్టార్‌లో AI హ్యూమనాయిడ్ రోబోట్‌ను రూపొందించినట్లు న్యూక్లియర్ సంస్థ ఒరానో(ఫ్రాన్స్), టెక్నాలజీ కంపెనీ క్యాప్‌జెమినీ ప్రకటించాయి. హోక్సో అనే పేరు కలిగిన ఈ రోబోట్ ఏఐ, నావిగేషన్, టెక్నికల్ ఆదేశాల అమలు, అడ్వాన్స్‌డ్ సెన్సార్లను కలిగి ఉందని తెలిపాయి. న్యూక్లియర్ కేంద్రాల్లో మానవులతో కలిసి పనిచేస్తుందన్నాయి.

News November 6, 2025

ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యంపై వైద్యుడి ఇంట్రెస్టింగ్ ట్వీట్!

image

ఆనందం, సరదా కోసం ఆల్కహాల్ తీసుకుంటే కలిగే అనర్థాలను వివరిస్తూ వైద్యుడు శ్రీకాంత్ మిర్యాల చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘బాధలో బీరు తాగితే బోన్ మ్యారో దెబ్బతింటుంది. స్కాచ్ తాగితే సిర్రోసిస్‌తో రక్తం కక్కుకుని చనిపోతారు. రమ్ సేవిస్తే రక్తహీనత వస్తుంది. సారా తాగితే సరసానికి పనికిరాకుండా పోతారు. వోడ్కా వల్ల గవదలు వాచిపోతాయి. వైన్ తాగితే గర్భస్రావాలు. మందు మానరా.. మనిషివయ్యేవు’ అని ఆయన సందేశమిచ్చారు.