News December 19, 2024

నా నుంచి రెండు రెట్లు ఎక్కువ రికవరీ చేశారు: మాల్యా

image

తన నుంచి ₹14,131cr రికవరీ చేసినట్లు FM నిర్మలా సీతారామన్ <<14914173>>ప్రకటించడంపై<<>> విజయ్ మాల్యా స్పందించారు. DRT ప్రకారం వడ్డీతో సహా తాను చెల్లించాల్సిన మొత్తం ₹6203cr అని తెలిపారు. కానీ ED, బ్యాంకులు దీనికి రెండు రెట్ల కంటే ఎక్కువ రికవరీ చేశాయని, ఎందుకు ఎక్కువ తీసుకున్నాయో చట్టబద్ధంగా నిరూపించాలని ట్వీట్ చేశారు. అప్పు రికవరీ అయ్యాక కూడా తాను ఇంకా నేరస్థుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు.

Similar News

News July 9, 2025

నిమిషకు మరణశిక్ష.. తప్పెవరిది?

image

యెమెన్‌లో <<17008510>>నిమిష <<>>మరణశిక్ష ఎదుర్కోబోతుండటం చర్చనీయాంశంగా మారింది. పాస్‌పోర్ట్ లాక్కుని వేధిస్తున్నాడని మెహదీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని అతడికి ఆమె మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఆత్మరక్షణ కోసమే ఇలా చేసిందని, వదిలేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల తప్పు కూడా ఉందంటున్నారు. PM మోదీ జోక్యం చేసుకుని విడిపించాలని కోరుతున్నారు.

News July 9, 2025

సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష.. గడువు పెంపు

image

TG: సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వరకు పొడిగించినట్లు CMD బలరామ్ నాయక్ తెలిపారు. UPSC సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారు దీన్ని గమనించాలన్నారు. తొలుత ఈ నెల 7వరకు గడువు విధించగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ పథకం కింద TG అభ్యర్థులతో పాటు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రూ.లక్ష సాయం చేయనున్నారు.

News July 9, 2025

జూన్‌లో SIPs ఇన్వెస్ట్‌మెంట్స్ రికార్డు

image

జూన్ నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌(SIPs)లో పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మేలో రూ.26,688 కోట్ల ఇన్‌ఫ్లో ఉండగా జూన్‌లో రూ.27,269 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. మొత్తం SIP అకౌంట్లు 90.6 మిలియన్ల నుంచి 91.9 మిలియన్లకు పెరిగాయని వెల్లడించింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్స్ జూన్‌లో రూ.74 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.