News December 19, 2024
60 ఏళ్లు పైబడిన వారికి వైద్యం ఫ్రీ: కేజ్రీవాల్

తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తే 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వైద్యం అందిస్తామని AAP చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ‘సంజీవని’ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని తెలిపారు. ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ చేస్తారని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.
News November 18, 2025
తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.


