News December 19, 2024

నెల్లూరు: హామీలు అమలుపై ఎమ్మెల్యేకు ఆయన కుమారుడు వినతి

image

ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌కు ఆయన తనయుడు కాకర్ల సంహిత్ వినతి పత్రం అందించారు. అమెరికాలో చదువుతూ నియోజకవర్గానికి వచ్చిన సంహిత్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, గుర్తించిన సమస్యలపై వినతి పత్రం అందించారు. ఎన్నికల ప్రచారంలో తనదృష్టికి వచ్చిన సమస్యలపై ఆయనకు వినతిపత్రంలో అందజేసి పరిష్కరించాలని కోరారు. ఆయన చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 9, 2025

రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొనవద్దు: కలెక్టర్ 

image

రెడ్‌క్రాస్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు IRCS నిబంధనల ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్‌, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆనంద్‌ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో రెడ్‌క్రాస్‌ మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు తటస్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా కొంత మంది రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను ఉల్లంఘించవద్దన్నారు. 

News January 8, 2025

జాతీయ కుష్టు వ్యాధి నివారణ పోస్టర్ ఆవిష్కరణ 

image

జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆనంద్ బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నివారణకు మరింత ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

News January 8, 2025

ఆ రోజుల్లో రూ.575కే నెల్లూరు నుంచి శ్రీలంకకు టూర్

image

ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లినా కనీసం రూ.2 వేలు దాటుతోంది. ఓ బ్రాండెడ్ షర్ట్ ధర రూ.800పైనే ఉంటోంది. అయితే రూ.500కు శ్రీలంక వెళ్లొచ్చు అంటే మీరు నమ్మగలరా.. నిజమేనండి. కాకపోతే ఇది 50 ఏళ్లనాటి మాట. 1974లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నెల్లూరు నుంచి రూ.575కే ఏకంగా 15 రోజుల పాటూ శ్రీలంకకు టూర్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఇందుకు సంబందించి ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ కామెంట్ చెప్పండి.