News December 19, 2024
HYD: విద్యార్థులకు సరళమైన రీతిలో విద్యా బోధన చేయాలి
జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యార్థులకు సరళమైన రీతిలో నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్‌లో డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎస్, కాంప్లెక్స్ హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లాస్ రూమ్‌లో 75% మంది పిల్లలకు చదవడం, రాయడం, అభ్యాస మెరుగుదల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలన్నారు.
Similar News
News January 17, 2025
HYD: ప్రకటనకు విరుద్ధంగా RTC ఛార్జీల బాదుడు..!
సంక్రాంతి పండుగ వేళ తిరుగు ప్రయాణంలో JAN 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు స్పెషల్ బస్సుల్లో అమలులో ఉంటాయని ప్రకటించిన ఆర్టీసీ అందుకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తోంది. MHBD జిల్లా తొర్రూరు నుంచి మేడ్చల్ జిల్లా ఉప్పల్ X రోడ్డు వెళ్లే సంక్రాంతి స్పెషల్ బస్సులో నేడు కూడా అదనపు ఛార్జీలు వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. మిగతా చోట్ల సైతం వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు.
News January 17, 2025
HYD: జంట హత్యల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
నార్సింగి PSలో <<15169186>>జంట హత్య<<>>కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. సాకేత్‌కు బిందుతో పరిచయం ఏర్పడింది. అనంతరం సాకేత్ సాయంతో బిందు వ్యభిచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందుతో ఏకాంతంగా గడిపి వీడియో తీసేందుకు యత్నించాడు. ఆమె అడ్డు చెప్పి అక్కడి నుంచి వచ్చి సాకేత్‌కు చెప్పడంతో రాహుల్‌ను హెచ్చరించాడు. దీంతో రాహుల్ కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి హతమార్చాడు.
News January 17, 2025
నేడు గుడిమల్కాపూర్ మర్కెట్ కమిటీ ప్రమాణం
గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగనుంది. ఛైర్మన్‌గా మల్లేశ్, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు హాజరుకానున్నారు.