News December 19, 2024
ఇవాళ, రేపు జాగ్రత్త

తెలంగాణను చలి వణికిస్తోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. ASF(D) సిర్పూర్(U)లో 5.9 డిగ్రీలు, HYDలో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.
Similar News
News November 8, 2025
ఇది రాజమౌళి మార్క్ కాదు.. పోస్టర్‌పై ఫ్యాన్స్ నిరాశ

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB 29 సినిమా నుంచి నిన్న విడుదలైన పోస్టర్ నిరాశపరిచిందని ఫ్యాన్స్ అంటున్నారు. విలన్ పృథ్వీ సుకుమారన్ వీల్ ఛైర్‌లో కూర్చున్నట్లు ఆ పోస్టర్ ఉంది. అయితే గతంలో వచ్చిన సూర్య ’24’లో అచ్చం ఇదే లుక్ ఉందని, ఇది రాజమౌళి మార్క్ కాదని పోస్టులు చేస్తున్నారు. చూడ్డానికి AI జనరేటెడ్ పిక్‌లా ఉందంటున్నారు. మరి ఈ పోస్టర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.
News November 8, 2025
NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 8, 2025
ఉప్పుడు బియ్యానికి అనుకూలమైన వరి రకం

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే రకం M.T.U 3626(ప్రభాత్). ఈ వరి రకం పంట కాలం 120 నుంచి 125 రోజులు. గింజ పొడవు మరియు ముతక రకం. ఈ రకం చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. M.T.U 3626 వరి రకం ఉప్పుడు బియ్యం, నూకకు అత్యంత అనుకూలం. ఎకరాకు 3 నుంచి 3.5 టన్నుల దిగుబడినిస్తుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.


