News December 19, 2024
వాంకిడి: కుల బహిష్కరణ కేసులో 8 మందికి జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734545232232_51374811-normal-WIFI.webp)
కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన 8 మందికి నెల రోజుల జైలు శిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ స్పెషల్ PDR కోర్టు ADB జడ్జి దుర్గారాణి బుధవారం తీర్పునిచ్చారు. వాంకిడిలోని రాంనగర్‌కు చెందిన ఆత్మారాం అతడి కుమారుడికి మధ్య భూ తగాదాలు జరగడంతో వారిని కుల పెద్దలు 4ఏళ్ల పాటు కులం నుంచి బహిష్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 2020మే20న వారిపై SHO రమేశ్ కేసు నమోదు చేయగా వారికి బుధవారం జడ్జి శిక్ష విధించారు.
Similar News
News February 5, 2025
ఆదిలాబాద్: 35 మందిలో ఆరుగురు ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738759447417_50249255-normal-WIFI.webp)
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం TSKC, TASK ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు.
News February 5, 2025
ADB: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738756129250_20476851-normal-WIFI.webp)
ఆదిలాబాద్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లాండసాంగి గ్రామ సమీపంలోని రహదారిపై మహారాష్ట్ర పాటన్ బోరికి చెందిన షాలిక్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 5, 2025
గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738747644415_51859030-normal-WIFI.webp)
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.