News December 19, 2024
ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గురువారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 1, 2026
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంతంటే?

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చి త్రైమాసికానికి ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా 8వ క్వార్టర్‌లోనూ వడ్డీ రేట్లను సవరించకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన-8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్, PPF-7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్-4%, కిసాన్ వికాస్ పాత్ర-7.5, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-7.7, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్-7.4% వడ్డీ రేట్లు ప్రస్తుతమున్నాయి.
News January 1, 2026
ఒత్తువాములు కోరుతుంది, పలచన పాతర్లు కోరుతుంది

వాము (ఓమ) పంటను సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా (ఒత్తుగా) ఉండాలి. అప్పుడే ఆ పంట దిగుబడి బాగుంటుంది. పాతర్లు (అంటే వరి నారు లేదా ఇతర కొన్ని రకాల పంటలు) నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం (పలచనగా) ఉండాలి. అప్పుడే ఆ మొక్కలకు గాలి, వెలుతురు సరిగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ పంటకు ఎంత దూరం ఉండాలో తెలిపే వ్యవసాయ సూత్రాన్ని ఈ సామెత చెబుతుంది.
News January 1, 2026
కొత్త ఏడాదిలో.. సంపద కోసం!

లక్ష్మీదేవి నివాసంగా భావించే వికసించే చెట్టు ఆకును, అలాగే శుభప్రదమైన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ స్వరూపమైన గవ్వలు, తామర గింజలను ఎర్రటి గుడ్డలో కట్టి పర్సు/బీరువాలో భద్రపరుచుకోవడం వల్ల డబ్బు నిలకడగా ఉంటుందని నమ్మకం. గోసేవ చేస్తే దైవానుగ్రహం లభించి ఏడాది పొడవునా మీ ఇంట్లో దారిద్ర్యం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం.


