News December 19, 2024
HYD: మీ పాస్వర్డ్ భద్రంగానే ఉందా?
రాచకొండ పోలీసులు పాస్వర్డ్ భద్రతపై అవగాహన కల్పిస్తూ ముఖ్య సూచనలు చేశారు. ఇటీవల HYDలో పలు సైబర్ క్రైమ్‌లు పాస్‌వర్డ్‌ల కారణంగా జరిగినట్లు తేల్చారు. తరచూ మార్చడం, సులభమైన పాస్‌వర్డ్‌లను (123456) ఉపయోగించకపోవడం, ఇతరులతో పాస్వర్డ్ పంచుకోకపోవడం, ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లలో లాగిన్ అవ్వకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భద్రతను మరింత మెరుగుపర్చేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగించాలని సూచించారు.
Similar News
News February 5, 2025
ఘట్కేసర్లో రైల్వే ట్రాక్‌పై సూసైడ్!
ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై మృతదేహం కలకలం రేపింది. మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల వివరాలు.. నిన్న రాత్రి కాగజ్‌నగర్ నుంచి బీదర్ వెళుతున్న రైలు కింద పడి వ్యక్తి చనిపోయాడు. తల మీదుగా ట్రైన్ వెళ్లడంతో ముఖం ఛిద్రమైంది. ఇది గమనించిన ట్రైన్ కో పైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 5, 2025
GHMCలో ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల
GHMCలో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్‌లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
News February 5, 2025
కూకట్‌పల్లిలో 8 మంది మహిళల బైండోవర్
కూకట్పల్లి PS పరిధిలోని భాగ్యనగర్ కాలనీ అల్లూరి ట్రేడ్ సెంటర్ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది మహిళలను కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకొని కూకట్పల్లి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.