News December 19, 2024

Stock Market: భారీ నష్టాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం Sensex 960 పాయింట్ల న‌ష్టంతో 79,207 వ‌ద్ద‌, Nifty 300 పాయింట్లు కోల్పోయి 23,900 వ‌ద్ద క‌దులుతున్నాయి. Pre-Open Marketలో IT షేర్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, FMCG, మెట‌ల్‌, ఫార్మా సహా అన్ని కీల‌క రంగాలు ఒక‌ శాతానికిపైగా న‌ష్ట‌పోయాయి. India Vix 15.14గా నమోదవ్వడం సెల్లింగ్ ప్రెజర్‌కు అద్దంపడుతోంది.

Similar News

News July 7, 2025

చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

image

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.

News July 7, 2025

సినీ హీరో మహేశ్‌బాబుకు నోటీసులు

image

TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న హీరో మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులిచ్చింది. తమ వెంచర్‌కు అన్ని అనుమతులున్నాయని మహేశ్ ఫొటోతో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్‌లో ₹34.80లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు ఫిర్యాదు చేశారు. లేఔట్ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ ₹15లక్షలే ఇచ్చిందన్నారు. దీంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని మహేశ్‌తో పాటు సంస్థను కమిషన్ ఆదేశించింది.

News July 7, 2025

‘నగరాలు’ కులస్థులకు BC-D కులపత్రాలు: సవిత

image

AP వ్యాప్తంగా ఉన్న నగరాలు సామాజిక వర్గీయులను BC-Dలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు మంత్రిని కలిసి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. తమ వర్గీయులకు BC-D కాస్ట్ సర్టిఫికేట్ అందించాలనే GO ఉన్నా, కేవలం VZM, SKLM, విశాఖ, కృష్ణా జిల్లాల్లోనే ఇది అమలవుతోందని వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.