News December 19, 2024

SBI MDగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావు

image

బ్యాంకింగ్ దిగ్గజం SBI ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం SBI డిప్యూటీ ఎండీగా ఉన్న ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్‌ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. రామ మోహన్ రావు MDగా బాధ్యతలు స్వీకరిస్తే SBI చరిత్రలో ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు అధిష్ఠించినట్లు అవుతుంది.

Similar News

News September 20, 2025

రేపటిలోగా అమెరికా వచ్చేయండి: మైక్రోసాఫ్ట్

image

H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో మైక్రోసాఫ్ట్, JP మోర్గాన్ కంపెనీలు తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి. ఉద్యోగులు అమెరికాలోనే ఉండాలని, విదేశాలకు వెళ్లవద్దని తెలిపాయి. ఇప్పటికే USను వదిలి వెళ్లిన H1B, H-4 వీసాదారులు SEP 21లోగా తిరిగి వచ్చేయాలని సూచించాయి. కాగా ఇప్పటికే H1B వీసాతో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు రెన్యూవల్, ట్రాన్స్‌ఫర్ టైమ్‌లో ఈ ఫీజు చెల్లించాల్సి వస్తుందని కంపెనీలు భయపడుతున్నాయి.

News September 20, 2025

అల్పపీడనం ముప్పు.. అతిభారీ వర్షాలకు అవకాశం!

image

తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది తుఫానుగా మారే అవకాశమూ ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.

News September 20, 2025

AIIMSలో 77 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హైదరాబాద్‌ సమీపంలోని బీబీనగర్ AIIMSలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 77 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1,170. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, జీతభత్యాల వివరాల కోసం <>https://aiimsbibinagar.edu.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
#ShareIt