News December 19, 2024
తిరుపతి: అత్తను అత్యంత కిరాతకంగా చంపిన అల్లుడు

తిరుపతిలో అత్తను ఆమె అల్లుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. అలిపిరి పరిధిలోని సింగాలగుంటకు చెందిన ద్రాక్షాయిని (55) కొడుకు, కోడలు తరచూ గొడవలు పడుతుండేవారు. గొడవలకు కారణం ద్రాక్షాయిని అని ఆమె కోడలి తమ్ముడు రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
నిండ్ర: బస్సును ఢీకొన్న లారీ

పుత్తూరు – చెన్నై జాతీయ రహదారిలో నిండ్ర మండలం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నిండ్ర మండలంలోని కొప్పేడు వద్ద సత్యవేడు ఆర్టీసీ డిపో బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయినట్లు సమాచారం. అలాగే ఇవాళ ఉదయం పుంగనూరు-చెన్నై హైవేపై రెండు బస్సులు ఢీకొన్న విషయం తెలిసిందే.
News October 28, 2025
కుప్పంకు భారీ పరిశ్రమలు… 22 వేలు మందికి ఉద్యోగాలు…!

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం పారిశ్రామిక వాడగా మారనుంది. నేడు వర్చువల్ గా నిర్వహించాల్సిన శంకుస్థాపన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. AELAP, ACE, E-ROYCE, ఆదిత్య బిర్లా గ్రూప్స్, ఎస్వీఎఫ్ సోయా కంపెనీలతో పాటుగా మదర్ డెయిరీ, శ్రీజ డెయిరీ 2027 నాటికి పూర్తి అవుతాయి. కంపెనీలు అందుబాటులోకి రాగానే ప్రత్యక్షంగా 22 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం.
News October 28, 2025
ఐరాల: ప్రమాదకరంగా రాకపోకలు

ఐరాల మండలంలోని ఉప్పరపల్లె గ్రామస్థులు నీవా నదిపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతపేట వద్ద ఇటీవల తాత్కాలికంగా నదిపై దారి ఏర్పాటు చేసుకున్నారు. వర్షాల నేపథ్యంలో దారి కొట్టుకుపోయింది. దీనిపై ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.


