News December 19, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.710 తగ్గి రూ.77,130కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.70,700గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000గా ఉంది.

Similar News

News November 15, 2025

చర్మంపై నల్ల మచ్చలొస్తున్నాయా?

image

చర్మంపై నల్లమచ్చలుంటే వాటిని సన్‌ స్పాట్స్‌ (ఫ్రెకెల్స్‌) అని అంటారు. ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యకాంతి తగలడం వల్ల రియాక్షన్‌ టెండెన్సీకి బ్రౌన్‌ రంగు మచ్చలు వస్తాయి. ఇలాంటప్పుడు ప్రతి 2-3గంటలకోసారి SPF 30/ 50 ఉన్న క్రీముని రాసుకుంటే సమస్యను కొంతవరకూ నియంత్రించవచ్చు. అలానే కోజిక్‌యాసిడ్, ఎజిలిక్‌ యాసిడ్, ఆర్‌బ్యూటిన్‌ వంటివి రాత్రి రాసుకుంటే పగటికాంతికి దెబ్బతిన్న చర్మం రాత్రికి రిపేర్‌ అవుతుంది.

News November 15, 2025

గొప్ప మానవతావాది సూపర్ స్టార్ కృష్ణ: YS జగన్

image

AP: తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూర‌గొన్న గొప్ప‌ న‌టుడు పద్మభూషణ్, సూప‌ర్ స్టార్‌ కృష్ణ అని YCP అధినేత వైఎస్ జగన్ కొనియాడారు. ‘ఎప్పుడూ కొత్త‌దనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయ‌న‌. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు’ అని ట్వీట్ చేశారు.

News November 15, 2025

‘శివ’ రీరిలీజ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.2.50కోట్లు

image

ఆర్జీవీ-నాగార్జున కాంబోలో తెరకెక్కిన ‘శివ’ మూవీ రీరిలీజ్‌లోనూ అదరగొట్టింది. నిన్న తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అన్ని దేశాల్లోనూ ఈ కల్ట్ క్లాసిక్‌కు మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇదే జోరు కొనసాగితే రూ.10 కోట్ల వసూళ్లు చేయడం గ్యారంటీ అని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా 1989లో విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.