News December 19, 2024
రష్యా VS అమెరికా: క్యాన్సర్ వ్యాక్సిన్ వార్!

రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ జియో పొలిటికల్ సమీకరణాలను పూర్తిగా మార్చేయనుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ వాణిజ్యాన్ని శాసించేది ఆయుధ, ఆయిల్, ఫార్మా రంగాలే. ఆరోగ్యం పేరుతో కోటాను కోట్ల వ్యాపారం సాగుతోంది. అందులో క్యాన్సర్‌పై పెట్టే ఖర్చు అపారం. దీనిని ముందుగా రష్యా క్యాపిటలైజ్ చేసుకొనే అవకాశం ఉండటంతో US సహా వెస్ట్రన్ కంట్రీస్‌కు మింగుడు పడటం లేదని సమాచారం. అవి కౌంటర్ స్ట్రాటజీ రచిస్తాయని అంచనా.
Similar News
News January 31, 2026
స్మార్ట్‌ఫోన్ మినరల్ కోసం వెతుకులాట.. 200 మంది గనిలోనే సమాధి!

తూర్పు కాంగోలో భారీ విషాదం చోటుచేసుకుంది. రుబాయా ప్రాంతంలోని ఓ Coltan మైన్ ఒక్కసారిగా కూలిపోవడంతో 200 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌లో వాడే ఈ లోహం కోసం అక్కడ మైనింగ్ జరుగుతోంది. రెబల్స్ కంట్రోల్లో ఉన్న ఈ గనుల్లో ఏమాత్రం భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈసారి ప్రాణనష్టం ఎక్కువగా ఉండటం అందరినీ కలచివేస్తోంది.
News January 31, 2026
ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్!

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 11న ఉదయం 10గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమై పని దినాలు, అజెండాను ఖరారు చేస్తుంది. ఫిబ్రవరి 14న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో FEB 3న CM చంద్రబాబు అధ్యక్షతన ఉ.10.30గం.కు క్యాబినెట్ సమావేశం జరగనుంది.
News January 31, 2026
కొక్కెర వ్యాధి నివారణకు సూచనలు

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.


