News December 19, 2024

ఈ నెలాఖరున అరకు ఉత్సవం

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరున అరకు ఉత్సవంను నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. అరకు ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మూడు రోజులుపాటు అరకు ఉత్సవాన్ని విజవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆధికారులకు సూచించారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

Similar News

News February 5, 2025

గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు. 

News February 5, 2025

పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు

image

రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.

News February 5, 2025

విశాఖ: ఎమ్మెల్సీ‌ బరిలో స్వతంత్ర అభ్యర్థి 

image

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఆనందపురం ఎంఈవోగా పదవీ విరమణ చేసిన ఎస్.ఎస్.పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ యూనియన్‌లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!