News December 19, 2024
VZM: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనపై నో క్లారటీ..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలో Dy.Cm పవన్ కళ్యాణ్ పర్యటనపై తర్జన భర్జన నెలకొంది. గురువారం సాయంత్రం భోగాపురం చేరుకుని PCOలతో మీటింగ్ ఏర్పాటు చేస్తారని తొలుత చర్చ జరిగింది. అయితే ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయ్యింది. శుక్రవారం ఉదయం వైజాగ్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, సాలూరు మీదుగా మక్కువ చేరుకుంటారని తెలుస్తోంది. కాగా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
Similar News
News January 1, 2026
రహదారి నిబంధనలను విధిగా పాటించాలి : కలెక్టర్

రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం వరకు నిబంధనలు పాటించకపోవడమే కారణమని తెలిపారు. వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు.
News December 31, 2025
VZM: రీసర్వే గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

జిల్లాలో రీసర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జనవరి 2 నుంచి 9 వరుకు అన్ని మండలాల్లో ముందుగా నిర్ణయించిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రీసర్వే పూర్తైన గ్రామాల రైతులు గ్రామ సభలకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 31, 2025
కుమ్మపల్లిలో యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

వేపాడ మండలం కుమ్మపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దేవరాపల్లి మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన చౌడువాడ దేవుడు నాయుడు బుధవారం తన స్నేహితుడు మహేష్‌తో కలసి బైక్‌పై కుమ్మపల్లి వెళుతుండగా రోడ్డు మలుపులో బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో గాయపడిన చౌడు నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


