News December 19, 2024
తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఇది మీకోసమే!

ఇంట్లో బైక్ కీ, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోతున్న వారికి గుడ్ న్యూస్. అలాంటి వారికోసం జియో వినూత్న పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. JioTag Go పరికరం Find My Device ద్వారా వస్తువులను ట్రాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా గ్యాడ్జెట్లు, కీలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. కీచైన్ మాదిరిగా దీనిని వాడుకోవచ్చు.
Similar News
News July 4, 2025
KCR లేటెస్ట్ ఫొటోలు

TG: సాధారణ వైద్య పరీక్షల కోసం HYD యశోద ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ అధినేత KCRను పలువురు నేతలు పరామర్శించారు. <<16940361>>ఎలాంటి ఇబ్బంది లేకుండా<<>> కుర్చీలో కూర్చున్న మాజీ సీఎం.. కాసేపు నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.
News July 4, 2025
ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం మాదే: భట్టి

TG: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మార్చడానికి అది కేవలం ఒక పుస్తకం కాదు. రాజ్యాంగం లేకపోతే ఎవరికీ హక్కులు ఉండేవి కావు’ అని సామాజిక న్యాయ సమరభేరి సభలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.
News July 4, 2025
వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: చంద్రబాబు

AP: రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు పేదల భూసమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ.10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి, రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.1,000 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను OCT 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూముల అంశంలో పేదలకు లబ్ధి జరిగేలా చూడాలని సీఎం సూచించారు.