News December 19, 2024

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆమె నిలిచారు. ఇప్పటివరకు స్మృతి 30సార్లు 50కిపైగా పరుగులు బాదారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆమె ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. వీరి తర్వాత బెత్ మూనీ (25), స్టెఫానీ టేలర్ (22), సోఫీ డివైన్ (22), వైట్ (20) ఉన్నారు.

Similar News

News January 13, 2026

మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

image

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.

News January 13, 2026

ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులకు నిధులు

image

TG: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు బకాయిలను విడుదల చేశారు. కలెక్టర్ల నివేదికల మేరకు అర్హులైన లబ్ధిదారుల పెండింగ్ బిల్లులకు రూ.12.17 కోట్లు రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD వి.పి.గౌతం తెలిపారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇండ్లు నిర్మించుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్ వరకే పనులు చేసిన వారి పెండింగ్ బిల్లులనూ ఈ నిధులతో క్లియర్ చేయనున్నారు.

News January 13, 2026

‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

image

సరిహద్దుల్లో చైనా షాక్స్‌గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్‌లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్‌లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.