News December 19, 2024
ఇవాళ్టి స్పెషల్: తోపులాటలు, రాజకీయ కేసులు!
దేశ రాజకీయాల్లో ఈ రోజు కేసులకు ప్రత్యేకంగా నిలిచింది. TGలో KTRపై ACB కేసు నమోదైంది. ఔటర్ రింగు రోడ్డు లీజు వ్యవహారంపై CM రేవంత్ అసెంబ్లీలో విచారణకు ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో NDA, INDIA కూటముల పరస్పర నిరసనలు, తోపులాటతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. రాహుల్ గాంధీపై BJP అటెంప్ట్ టు మర్డర్, స్వచ్ఛంద దాడి సెక్షన్లతో కేసు పెట్టింది. ‘BJP దౌర్జన్యం’పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వీటిపై మీ కామెంట్
Similar News
News February 5, 2025
బెస్ట్ క్లోజప్ ఫొటోగ్రాఫ్స్ -2025 ఇవే
క్లోజప్ ఫొటోగ్రాఫ్స్ -2025 విజేతలను ‘ఫోర్బ్స్’ ప్రకటించింది. కీటకాల విభాగంలో స్వెత్లానా(రష్యా) తీసిన మగ స్టాగ్ బీటిల్స్ గొడవ పడుతున్న ఫొటోకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. యువ విభాగంలో 14ఏళ్ల ఆండ్రెస్(స్పెయిన్) తీసిన తేనెటీగలను పక్షి తింటోన్న ఫొటో విజేత. ఇందులోనే జర్మనీకి చెందిన 17ఏళ్ల అలెక్సిస్ తీసిన రాబర్ ఫ్లై మరో కీటకాన్ని తింటోన్న ఫొటోకు సెకండ్ ప్రైజ్. కాగా, పంట తింటోన్న ఎలుక ఫొటో ఆకట్టుకుంటోంది.
News February 5, 2025
ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని NTR వైద్యసేవ CEOను ఆదేశించింది. ఇప్పటి వరకు TGలో 11 ఆస్పత్రుల్లోనే NTR వైద్యసేవ ట్రస్టు సేవలు అందుతున్నాయి. దీంతో 2015 తర్వాత ట్రస్టు గుర్తింపులేని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <