News December 19, 2024
స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా అరెస్ట్ చేస్తారా?: ఆర్జీవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌ను సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించాలని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘ఏ సినీ స్టార్ అయినా, పొలిటికల్ స్టార్ అయినా పాపులర్ కావడం వారి తప్పా? అలాగైతే ‘క్షణం క్షణం’ షూటింగ్ సమయంలో శ్రీదేవిని చూసేందుకు వచ్చిన వేలాది జనంలో ముగ్గురు చనిపోయారు. మరి తెలంగాణ పోలీసులు ఇప్పుడు స్వర్గానికి వెళ్లి శ్రీదేవిని అరెస్ట్ చేస్తారా?’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ

AP: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధుల విడుదలకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
News July 9, 2025
మంత్రులకు CM చంద్రబాబు వార్నింగ్!

AP: YCP దుష్ప్రచారాలతో పాటు అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని CM CBN సూచించారు. లేదంటే ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని క్యాబినెట్ భేటీలో హెచ్చరించారు. కాగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు YCP ఈ-మెయిళ్లు పెట్టించినట్లు మంత్రి కేశవ్ CM దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన CM.. YCP కుట్రలపై విచారణకు ఆదేశిస్తామన్నారు.
News July 9, 2025
సిగాచీ.. ఆ 8 మంది మృతిచెందారని అనుమానాలు

TG: సిగాచీ ప్రమాద ఘటనలో ఆచూకీ దొరకని 8 మంది మరణించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించడం కష్టమేనని తెలిపారు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ కాలి బూడిదై ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు. ఈ ఘటనలో అంతకుముందు 44 మంది మరణించారు.