News December 19, 2024
HYD జూ నుంచి సింహం తప్పించుకుందా?.. క్లారిటీ

హైదరాబాద్ జూ నుంచి సింహం తప్పించుకుని నగరంలో ప్రవేశించిందని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ RM దోబ్రియాల్ స్పందించారు. ‘ఇది ఓ ఫేక్ న్యూస్. సింహంపై తీసిన ఓ సినిమా ప్రమోషన్లకు దీనిని ఉపయోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేయాలని మూవీ టీమ్‌ను ఆదేశించాం’ అని చెప్పారు.
Similar News
News July 6, 2025
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 6, 2025
బిహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు: రాహుల్ గాంధీ

BJP, CM నితీశ్ కలిసి బిహార్‌ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్‌లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్‌ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.
News July 6, 2025
సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.