News December 20, 2024

TODAY HEADLINES

image

* ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
* KTRపై కేసు నమోదు
* రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు: KTR
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* బాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే: జగన్
* రాహుల్ గాంధీపై FIR నమోదు
* భారీగా తగ్గిన బంగారం ధర
* ‘బలగం’ మూవీ నటుడు మొగిలయ్య మృతి

Similar News

News November 9, 2025

రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవచ్చా?

image

రోడ్డు పక్కన ఇంటి నిర్మాణాలు ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవాలంటే స్థానిక సంస్థల అనుమతి ఉండాలి. రోడ్డు వెడల్పును బట్టి ఎత్తు పరిమితిని నిర్ణయిస్తారు. వాస్తు శాస్త్రం కూడా దీనిని నిర్ధారిస్తుంది. అయితే ఇంటికి రోడ్డుకు మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండాలి. గాలి, వెలుతురు ఇంట్లోకి రావడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి’ అని ఆయన చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 9, 2025

సంక్రాంతికి రవితేజ సినిమా.. రేపే ఫస్ట్ లుక్

image

రవితేజ 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఆశికా రంగనాథ్ హీరోయిన్‌. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని రవితేజకు ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందేమో చూడాలి.

News November 9, 2025

ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

image

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.