News December 20, 2024
డిసెంబర్ 20: చరిత్రలో ఈరోజు

1934: వ్యవసాయ శాస్త్రవేత్త ఈడుపుగంటి వెంకట సుబ్బారావు జననం
1940: శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి జననం (ఫొటోలో)
1951: కథారచయిత కన్నేపల్లి చలమయ్య జననం
1988: సినీ నటి బి.జయమ్మ మరణం
☛ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
Similar News
News November 3, 2025
రాష్ట్రంలో 225 ఉద్యోగాలు.. APPLY చేశారా?

TG: జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగుస్తుంది. HYD, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://tgcab.bank.in/
News November 3, 2025
నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తా: KTR

TG: కంటోన్మెంట్ నియోజకవర్గానికి CM రేవంత్ రూ.4 వేలకోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని KTR ఓ ఇంటర్వ్యూలో సవాలు చేశారు. నిరూపించలేకపోతే CM రేవంత్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ‘4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే 420 హామీలు అమలవుతాయి. PJR మీద ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెటివ్వలేదు’ అని ప్రశ్నించారు.
News November 3, 2025
కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో ఏర్పాట్లు

UPలోని కాశీ మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న అక్కడ దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గంగా నది ఘాట్లతోపాటు నదీ తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనుంది. అలాగే కాశీ గొప్పతనాన్ని చాటేలా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో, 3D ప్రజెంటేషన్ ఉండనుంది.


