News December 20, 2024
PHOTOS: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ

ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులతో సంభాషించినట్లు మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Xలో పోస్ట్ చేశారు.
Similar News
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.
News April 20, 2025
మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

స్టార్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వారిలో ఆడాలన్న ఆకలి, తమ జట్లకు ట్రోఫీలను గెలిపించాలన్న కసి ఏమాత్రం కనిపించడం లేదు. ఇద్దరూ భారత్‌లో హాలిడే చేసుకోవడానికి వచ్చారంతే. నేను చాలామంది ఓవర్సీస్ ఆటగాళ్లతో ఆడాను. వాళ్లలో అధికశాతం ఆటగాళ్లు ఇలాగే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది IPLలో మ్యాక్సీ PBKSకి, లివింగ్‌స్టోన్ RCBకి ఆడుతున్నారు.
News April 20, 2025
IPL: టాస్ గెలిచిన ముంబై

వాంఖడేలో MIvsCSK మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో గత నెల 23న ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఈరోజు పోరు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఐపీఎల్ ప్రియుల్లో నెలకొంది.
జట్లు:
CSK: రషీద్, రచిన్, మాత్రే, శంకర్, దూబే, జడ్డూ, ఓవర్టన్, ధోనీ, నూర్, ఖలీల్, పతిరణ
MI: రికిల్‌టన్, జాక్స్, సూర్య, తిలక్, పాండ్య, నమన్, శాంట్నర్, చాహర్, బౌల్ట్, బుమ్రా, అశ్వని