News December 20, 2024
బుమ్రా అంటే కుడిచేతి వసీమ్ అక్రమ్: లాంగర్

జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసలు కురిపించారు. అతడి బౌలింగ్‌ను ఆడేందుకు తానైతే ఇష్టపడనని పేర్కొన్నారు. ‘నేను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన బౌలర్ ఎవరంటే వసీమ్ అక్రమ్ అని చెబుతాను. బుమ్రా కుడిచేతి వాటం వసీమ్ అక్రమ్‌లా ఉన్నారు. పేస్, రెండు వైపులా స్వింగ్, రివర్స్ స్వింగ్, బౌన్సర్, స్లో బాల్.. ఒకటేముంది? అన్ని బంతులూ బుమ్రా అమ్ములపొదిలో ఉన్నాయి’ అని కొనియాడారు.
Similar News
News March 14, 2026
ఇరాన్‌పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

ఇరాన్‌పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్‌లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
News March 14, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 14)

1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం (ఫొటోలో)
1883: తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త కారల్ మార్క్స్ మరణం
1917: సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ జననం
1931: భారత్‌లో తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’ విడుదల
1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
2008: శంషాబాద్ విమానాశ్రయ ప్రారంభోత్సవం
2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
* అంతర్జాతీయ గణిత దినోత్సవం
News March 14, 2026
IPLకు హర్షిత్ రానా దూరం?

ఈ నెల 28 నుంచి జరగనున్న IPL-2026కి టీమ్‌ఇండియా బౌలర్, KKR పేసర్ హర్షిత్ రానా దూరమైనట్లు నేషనల్ మీడియా పేర్కొంది. టీ20 WCకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో గాయపడిన ఆయన ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. గత రెండు సీజన్లలో KKR తరఫున రానా 34 వికెట్లు తీశారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా ఆకాశ్ మద్వల్, సిమర్జీత్ సింగ్‌తో పాటు మరికొంతమంది డొమెస్టిక్ బౌలర్ల పేర్లను KKR పరిశీలిస్తున్నట్లు సమాచారం.


