News December 20, 2024
పాకాల వాగులో మొసలి ప్రత్యక్షం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగులో మొసలి ప్రత్యక్షమైంది. యాసంగి సాగు చేసుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులకు వాగులో పెద్ద బండపై సేద తీరుతున్న మొసలి కంటపడింది. ఇది చూసిన రైతులు భయపడ్డారు. పాకాల సరస్సు నుంచి ఆ మొసలి రావొచ్చని భావిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
Similar News
News October 30, 2025
WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.
News October 30, 2025
వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్.ఎన్. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
News October 30, 2025
బాధితులకు అండగా ఉండండి: వరంగల్ కలెక్టర్

భారీ వర్షాల ప్రభావంతో జలదిగ్బంధంలో ఉన్న ఎన్ఎన్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా స్వయంగా సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను మార్గనిర్దేశం చేస్తూ తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


